చీరాల : వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభించిన సంచార రైతు బజార్ వద్ద తక్కువ ధరకే కూరగాయలను విక్రయిస్తున్నారు. పట్టణంలోని 11వ వార్డులో మాజీ కౌన్సిలర్ వద్దంటే సత్యనారాయణ ఆధ్వర్యంలో కూరగాయల విక్రయాలు చేశారు. ముత్యాల పేట లోని మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రం వద్ద వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మార్పు గ్రెగరీ, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం రమేష్ బాబు, వైసిపి పట్టణ కన్వీనర్ ఎడం రవిశంకర్ కూరగాయల విక్రయాలను ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సహకారంతో ఏర్పాటుచేసిన సంచార రైతు బజార్ వాహనం వద్దకు పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరై కూరగాయలు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు గలాభా పరశురాం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కనపర్తి బుజ్జి బాబు పాల్గొన్నారు.