Home ఆంధ్రప్రదేశ్ మెడికల్ పీజీ అడ్మిషన్లలో రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం

మెడికల్ పీజీ అడ్మిషన్లలో రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం

310
0

– జీవో నంబర్ 43 పేరుతో రిజర్వేషన్ అభ్యర్థుల సీట్లను ఓపెన్ కేటగిరీకి మారుతున్న వైనం
– ఉన్నత వైద్య విద్యకు రిజర్వేషన్ అభ్యర్థులను దూరం చేస్తున్న ప్రభుత్వ విధానం
– రిజర్వేషన్ అభ్యర్థులకు న్యాయం చేయకుంటే ఉద్యమం తప్పదంటున్న బీసీ సంఘాల ప్రతినిధులు
చీరాల : మెడికల్ పీజీ కౌన్సిలింగ్ లో రిజర్వేషన్ వర్గాల అభ్యర్థుల సీట్లను ఓపెన్ కేటగిరీకి మార్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసే జీవో నంబర్ 43 ను రద్దు చేయాలని చీరాల నియోజకవర్గ యాదవ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నాయకులు గొల్లప్రోలు శ్రీనివాసరావు, గొర్ల వెంకటేశ్వరరావు, పాలేటి సురేష్ కోరుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నత వైద్య విద్య ప్రవేశాలకు అప్పటి ప్రభుత్వం రూపొందించిన జీవో నెంబర్ 43 రిజర్వేషన్ల స్ఫూర్తికి భిన్నంగా, సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రిజర్వేషన్ విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసే విధంగా ఉందని పేర్కొన్నారు.

పీజీ మెడికల్ కౌన్సిల్ లో ఏదో ఒక విభాగంలో ఏదో ఒక కళాశాలలో సీట్లు పొందిన అభ్యర్థులు తమ స్పెషలైజేషన్ ను మార్చుకుంటే పూర్వపు సీటును అదే రిజర్వేషన్ విద్యార్థులకు కేటాయించాల్సి ఉండగా ఆ సీటును ఓపెన్ కేటగిరీ కింద మార్చి ఉన్నత వర్గాల విద్యార్థులకు కట్టబెట్టడం రిజర్వేషన్ విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేయడమేనని బీసీ సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా వైద్యవిద్యలో అభ్యర్థులు కళాశాలలకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే పి జి స్పెషలైజేషన్లో మాత్రం స్పెషలైజేషన్ కి ప్రాధాన్యత ఇస్తారు. ఈ ప్రకారం అభ్యర్థి తొలుత పొందిన సీటును స్పెషలైజేషన్ మార్చుకున్నప్పుడు ఆ సీటును అదే సామాజిక వర్గానికి చెందిన మరో అభ్యర్థి కేటాయించాల్సి ఉండగా ఓపెన్ కేటగిరీ కింద మార్చి ఉన్నత వర్గాల అభ్యర్థులకు సీట్ల కేటాయింపు చేయడం రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. రిజర్వేషన్ల ప్రక్రియలో 2018 జనవరి 11న త్రిపురారి చరణ్ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు.

తాము బీసీల ప్రభుత్వ ప్రతినిధులు అని చెప్పుకుంటున్న ప్రస్తుత ప్రభుత్వం పీజీ మెడికల్ కౌన్సిల్ లో రిజర్వేషన్ల పూర్తి భిన్నంగా ఉన్న జీవో నంబర్ 43 ను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. జీవోను రద్దు చేయకుంటే ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న రిజర్వేషన్ ప్రజాప్రతినిధులందరూ వారి పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో బీసీలు ఇతర రిజర్వేషన్ ప్రజలకు అండగా కలిసిరావాలని కోరారు.