పిట్లవానిపాలెం : ఆల్లురు గ్రామంలో సాధారణ మరణం పొందిన బడుగు సుశీల కుటంబాన్ని శాసన మండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ ఆదేశాల మేరకు భీమా మిత్ర ప్రతినిధులు పరామర్శించారు. చంద్రన్న బీమా నగదు రూ.5వేలు అందజేశారు. భీమా మిత్ర పత్రాలు అందజేశారు. మరో నెల రోజుల వ్యవధిలో రూ.25వేలు బ్యాంక్ ఖాతాలో జమచేయనున్నట్లు భీమా మిత్ర తెలిపారు.