తెనాలి : పట్టణం చెంచుపేట వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఆలపాటి శివరామ కృష్ణయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. పోటీల్లో ఉమ్మడి కృష్ణ – గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు పలువురు నాయకులు, శాసన సభ్యులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తొలుత ఎన్‌టిఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆలపాటి పుట్టిన రోజు కేక్‌కట్ చేసి బాపట్ల శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎడ్ల పోటీలను ప్రారంభించారు. పోటీల్లో గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేశారు.