శింగరాయకొండ : రామాయపట్నం పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. మరో 45రోజుల్లో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర మంత్రి శిద్దా రాఘవరావు ప్రభుత్వం తరపున ఈపాటికే ప్రకటించారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రామాయపట్నం రానున్నారు. తేదీ ఖరారు కావాల్సి ఉంది. అయితే ఈలోపు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను కదుకూరు ఎంఎల్ఎ పోతుల రామారావు, అటవీ శాఖ అభివృద్ది కార్పోరేషన్ ఛైర్మన్, మాజీ ఎంఎల్ఎ డాక్టర్ దివి శివరామ్ రామాయపట్నంలో ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. సభాస్థలం, వేదిక ఏర్పాటు వంటి అంశాలను అధికారులతో చర్చించారు. వీరివెంట అధికారులతోపాటు టిడిపి నాయకులు ఉన్నారు.