చీరాల : శాసన సభ్యులు ఎంఎం కొండయ్య తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఆయన ప్రజలను నేరుగా కలుసుకుని సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రతి ఒక్కరి సమస్య పరిష్కరించే దిశగా పని చేస్తామని అన్నారు. బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులు పని చేయాలని సూచించారు. నియోజకవర్గ ప్రజల నుండి స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పని చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా 750 మంది వివిధ సమస్యలపై వినతులు అందజేశారు. వీటిలో పెన్షన్ కోసం 100 అర్జీలు, ఇళ్ల స్థలాలు కోరుతూ 630 అర్జీలు, ఇతర సమస్యలపై 20 అర్జీలు ఇచ్చారు. కార్యక్రమంలో తెలుగుదేశం యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్, తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.






