Home బాపట్ల చీరాల అభివృద్ధిపై పవన్‌కళ్యాణ్‌కు ఎమ్మెల్యే కొండయ్య వినతి

చీరాల అభివృద్ధిపై పవన్‌కళ్యాణ్‌కు ఎమ్మెల్యే కొండయ్య వినతి

9
0

చీరాల (DN5 News) : శాసన సభ్యులు ఎంఎం కొండయ్య (MLA Kondaiah)డిప్యూటి సిఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌ను (DCM Pawan Kalyan) ఆయన ఛాంబర్‌లో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చించారు. శాఖాపరమైన ప్రధాన సమస్యలు ఆయనకు వివరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మరమ్మతులకు నోచుకోని రోడ్లు, తాగునీటి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. చీరాల, వేటపాలెం మండలాల పరిధిలోని గ్రామాల్లో రోడ్ల మరమ్మతులు చేపట్టడంతో పాటు కొత్త రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు.

గత ప్రభుత్వంలో అనేక రోడ్లు నిర్లక్ష్యానికి గురై అధ్వాన స్థితికి చేరుకున్నాయని వివరించారు. ఇటీవల తుపాన్ ప్రభావంతో సముద్రతీర ప్రాంతాల్లోని కల్వర్టులు, ప్రధాన రహదారులు, గ్రామీణ రోడ్లు దెబ్బతిన్నాయని వివరించారు. జల్ జీవన్ మిషన్ పధకం ద్వారా చేపట్టిన, చేపట్టాల్సిన తాగునీటి ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలిపారు. చీరాల అభివృద్ధి అంశాలపై ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి నిధుల మంజూరుకు భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ఇక పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతున్న చీరాల ప్రాంతాన్ని సందర్శించాలని ఆహ్వానించగా పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.