చీరాల (Chirala) : మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను (Gottepati Ravikumar)తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శాసన సభ్యులు ఎంఎం కొండయ్య (MLA MM Kondaiah) మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్ సమస్యలు, విద్యుత్ సరఫరాలో చోటుచేసుకుంటున్న అంతరాయాలు, ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలు, లో వోల్టేజితో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి సమస్యలు పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని ఎంఎల్‌ఎ తెలిపారు. ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందేలా తగిన సూచనలు ఇస్తానని పేర్కొన్నట్లు తెలిపారు.






