Home బాపట్ల ఇఫ్తార్‌ విందులో ఎంఎల్‌ఎ కొండయ్య

ఇఫ్తార్‌ విందులో ఎంఎల్‌ఎ కొండయ్య

15
0

వేటపాలెం (DN5 News) : టీడీపీ నాయకులు షేక్ ఖజ్జి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు శాసన సభ్యులు ఎంఎం కొండయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నాను. అనంతరం ప్రతి ఒక్కరికి స్వయంగా భోజనం వడ్డించారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలు ఎంతో కఠోరమైన ఉపవాస దీక్షలు చేస్తుంటారని, ఆకలి విలువ, భోజనం విలువ తెలిసే విధంగా ఈ ఉపవాస దీక్షలు ఉంటాయని అన్నారు.

రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక చోట సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అన్నారు. సేవా గుణం చాటుకుంటున్న వారందరిని ప్రత్యేకంగా అభినందించారు. చీరాలలో మతసామరస్యానికి ప్రతీకగా ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి పండుగలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ కౌతరపు జనార్ధన్, తెలుగుదేశం సీనియర్ నాయకులు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాసిక వీరభద్రయ్య, వేటపాలెం గ్రామ అధ్యక్షులు పోతురాజు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.