Home ప్రకాశం నియోజకవర్గంలో ప్రజాసమస్యలపై ఎమ్మెల్యే బలరామకృష్ణమూర్తి సమీక్ష

నియోజకవర్గంలో ప్రజాసమస్యలపై ఎమ్మెల్యే బలరామకృష్ణమూర్తి సమీక్ష

406
0

చీరాల : నియోజకవర్గంలోని చీరాల, వేటపాలెం మండలాల పరిధిలోని అన్ని పంచాయతీల్లో ఉన్న ప్రజా సమస్యలపై అధికారులతో ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల వారీగా, శాఖల వారీగా సమస్యలపై వివరాలను సేకరించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి అవసరాలపై సమీక్షించారు. వేసవి సమీపిస్తున్నందున తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల సర్వేల్లో చాలామంది అర్హులకు పెన్షన్లు తొలగించారని, గ్రామాల వారిగా వాటిని పరిశీలించి అర్హులందరికీ పెన్షన్ పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచనలు చేశారు. రాజకీయాలతో పని లేకుండా ప్రజలకు సౌకర్యవంతముగా సమన్వయంతో అధికారులు పనిచేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో, చీరాల వేటపాలెం తాసిల్దార్ లు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.