చీరాల : నియోజకవర్గంలో కరోనా వైరస్ పై ఎమ్యెల్యే కరణం బాలరామకృష్ణమూర్తి మునిసిపల్ కౌన్సిల్ హాలులో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోన బారినపడి ఇబ్బంది పడుతున్న ప్రజలకు కరోన హెల్త్ సెంటర్, ఐసోలేషన్ వార్డులో మెరుగైన సేవలను అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం కరోన వైరస్ కట్టడికి సహకరించాలని ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి కోరారు.
ఈ సమావేశానికి జెడ్పీ సీఈవో గిరీష్ కైలాష్, మున్సిపల్ కమిషనర్ ఏసయ్య, డీఎస్పీ శ్రీకాంత్, చీరాల ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ శేషుకుమార్, కరోనా హెల్త్ సెంటర్ ఇన్చార్జ్ నర్సింహారావు, చీరాల,వేటపాలెం తహసీల్దార్ లు హుస్సేన్, మహేశ్వరరావు, ఎండివోలు సాంబశివరావు, నేతాజీ, సీఐలు రాజమోహన్, రోశయ్య, పాపారావు, ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం పాల్గొన్నారు.