యర్రగొండపాలెం : దోర్నాల మండలం చర్లపల్లి, త్రిపురాంతకం మండలం దువ్వాలి, యర్రగొండపాలెం మండలం గంగపల్లి గ్రామాలలో భూమి కొనుగోలు పథకంపై ఎంఎల్ఎ పాలపర్తి డేవిడ్రాజు అధికారులతో చర్చించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కార్యాలయంలో ఈడీ కే కృష్ణవేణితో చర్చించారు. నియోజకవర్గంలో ఇళ్లులేని పేదలకు పక్కా గృహాలు మంజూరు చేసేందుకు స్థలం ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ప్రభుత్వ స్థలం లేనందున స్థలం కొనుగోలు చేసి ఇచ్చే పథకం ద్వారా ఇచ్చందుకు అనుగుణంగా నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ ఆంజనేయులు, మెడబలిమి ఉచితరావు పాల్గొన్నారు.