Home బాపట్ల ఎంఎల్‌ఎ, ఛైర్మన్‌ కలిసే చలివేంద్రాలు ప్రారంభం

ఎంఎల్‌ఎ, ఛైర్మన్‌ కలిసే చలివేంద్రాలు ప్రారంభం

56
0

చీరాల : పట్టణంలో పురపాలక సంఘం అధికారికంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాలు శాసన సభ్యులు ఎంఎం కొండయ్య ప్రారంభించారు. మునిసిపల్ ఆఫీస్, మసీద్ సెంటర్, గడియార స్తంభం సెంటర్, రైల్వే స్టేషన్ నందు చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మద్దులూరి మాలకొండయ్య మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు దోహద పడతాయని అన్నారు. వేసవి దష్టిలో ఉంచుకొని సామాన్య ప్రజలు, పాదచారులు, అందరి దాహార్తి తీర్చేందుకు ఈ చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్, తెలుగుదేశం యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్, మున్సిపల్ ఛైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, కమిషనర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

oplus_131074