శ్రీకాళహస్తి : తిరుపతి, తిరుమల తర్వాత బతుకు తెరువుకు అనువైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే ఆది శ్రీకాళహస్తి క్షేత్రమే అని అంటారు. అలాంటి ఆధ్యాత్మిక కేంద్రానికి ఉపాధికోసం పొట్ట చేతపట్టుకుని వచ్చిన ఒక కుటుంబానికి తీరని శోకం మిగిలింది.
ఉత్తరప్రదేశ్ నుంచి బతుకు తెరువు కోసం కొన్ని కుటుంబాలు పొట్ట చేత పట్టుకొని శ్రీకాళహస్తికి వచ్చారు. జీవనోపాధి నిమిత్తం కొందరు ఇటుక బట్టీల్లో పని చేస్తూ ఉంటే, మరికొందరు పానీ పూరి వ్యాపారం చేసుకుని బతుకుతున్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అమీర్పేట్ డిస్టిక్, తాల్ది బీహార్ గ్రామంకు చెందిన శ్రీ చంద్ర, భూరి 4 సంవత్సరాల క్రితం జీవనోపాధి కొరకు శ్రీకాళహస్తి వలస వచ్చారు. అప్పటి నుంచి వీరి కుటుంబం మొత్తం పానీ పూరి తయారుచేసి దాన్ని తోపుడు బండిపై అమ్ముతూ జీవనం కొనసాగిస్తూ వచ్చారు.
వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు రింకు 18సం, కూతురు పింకీ 16సం, వీరిద్దరు కూడా తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా పని చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల వీళ్ళ తల్లిదండ్రులు స్వస్థలమైన తాల్ది బీహార్ గ్రామంకు వెళ్లారు. పిల్లలైనా రింకు, పింకీ, మాత్రం కాళహస్తిలోనే ఉంటున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం వరకు ఇంట్లో ఉన్న పింకీ తరువాత కనపడకపోవడంతో సోదరుడు రింకు స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఏ కామాంధులు కళ్ళు పడిందో తెలియదు గాని 16సం పింకీ శవమై కనిపించింది. స్థానిక చెత్త డంపింగ్ యార్డ్ లో కాలీ, కాలక శవమై పడి ఉన్న పింకీని చూసిన స్థానికులు ఆ కామాంధులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. సమాచారం అందుకున్న తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బు రాజన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆయనతో పాటు శ్రీకాళహస్తి డిఎస్పీ రామకృష్ణ, టూ టౌన్ సిఐ బాల సుబ్రహ్మణ్యంరెడ్డి, ఏసై శివయ్య ఉన్నారు. మృతదేహంను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి కి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.