Home ఆంధ్రప్రదేశ్ దొంగ ఓట్లు తొలగిస్తే టిడిపికి నష్టమేంటి? – సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున

దొంగ ఓట్లు తొలగిస్తే టిడిపికి నష్టమేంటి? – సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున

258
0

వేమూరు : దొంగ ఓట్లను తొలగిస్తే టిడిపి నష్టం, బాధ ఏమిటని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మెరుగు నాగార్జున ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా దొంగ ఓటు ఉండటానికి వీలు లేదని అన్నారు. ఈ విషయంలో తాను ఛాలెంజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడ దొంగ ఓటు ఉన్నా తొలగిస్తామన్నారు. నిజాయతీగా ఓటు లేకపోతే అటువంటి వారికి ఓటు కల్పిస్తామని అన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరగాలంటే దొంగ ఓట్లు తొలగించాల్సిందేనని అన్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలలో నిజాయతీగా తాము గెలిచామని అన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా తమ నాయకుడు సిఎం జగన్మోహన్‌రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నాడని అన్నారు. తాము ఎక్కడా, ఎవరికీ వెన్ను పోటు పొడిచి అధికారంలోకి రాలేదని చంద్రబాబు నుదేశించి అన్నారు. తాము మరోసారి నిజాయితిగా ప్రజల మద్దతుతో గెలుస్తామని అన్నారు. దొంగ ఓట్లను తొలగిస్తే ఎందుకు చంద్రబాబు దగ్గర నుండి ఆనందబాబు వరకు టిడిపి నేతలు అందరూ భయ పడుతున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగ బద్దంగా పేదవాడికైనా, కోటీశ్వరుడు కైనా ఒకే ఓటు ఉంటుందని అన్నారు. అలాంటిది దొంగ ఓట్లు తలగిస్తే కంప్లయింట్ ఇస్తారా? ఎవరిమిద ఇస్తారు? తామే ఈ నెల 28న దొంగ ఓట్లు తొలగించమని ఎన్నికల కమిషన్‌ను కలుస్తున్నామని చెప్పారు.