Home ప్రకాశం ఉమ్మడి ప్రకాశం నేతలకు మంత్రి లోకేష్‌ ఆత్మీయ విందు

ఉమ్మడి ప్రకాశం నేతలకు మంత్రి లోకేష్‌ ఆత్మీయ విందు

8
0

అమరావతి (DN5 News) : యువనేత, ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఉమ్మడి ప్రకాశం, బాపట్ల పార్లమెటు పరిధిలోని ఎంఎల్‌ఎలకు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా అనుబంధ కమిటీల నియామకంపై చర్చించారు. మంత్రి ఆహ్వానం మేరకు బాపట్ల, ఒంగోలు ఎంపిలు తెన్నేటి కృష్ణప్రసాద్‌, మాగుంట శ్రీనివాసులురెడ్డి, మంత్రులు గొట్టిపాటి రవికుమార్‌, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్‌, చీరాల, బాపట్ల, పర్చూరు, సంతనూతలపాడు, గొద్దలూరు, కనిగిరి, ఒంగోలు ఎంఎల్‌ఎలు ఎంఎం కొండయ్య, వేగేశన నరేంద్రవర్మ, ఏలూరి సాంబశివరావు, బిఎన్‌ విజయకుమార్‌, ఎం అశోక్‌రెడ్డి, డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి, దామచర్ల జనార్ధనరావు పాల్గొన్నారు.