Home ప్రకాశం శ్రీ ప్రసన్నాంజనేయునికి మంత్రి గొట్టిపాటి పట్టు వస్త్రాలు సమర్పణ

శ్రీ ప్రసన్నాంజనేయునికి మంత్రి గొట్టిపాటి పట్టు వస్త్రాలు సమర్పణ

5
0

అద్దంకి (DN5 News) : శింగరకొండలో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం 71వ వార్షికోత్సవ తిరునాళ్లు ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్వామి వారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య పూజల అనంతరం ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని దేవస్థాన కమిటీ, సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, క్యూలైన్లు, పారిశుద్ధ్య ఏర్పాట్లు సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
లక్ష్మినరసింహకు పట్టు వస్త్రాలు బహూకరణ
సింగరకొండ కొండపై వేంచేసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.