Home ఆంధ్రప్రదేశ్ నెల్లూరు విఆర్ కళాశాలలో మౌలిక వసతులపై జలవనరుల శాఖ మంత్రి పరిశీలన

నెల్లూరు విఆర్ కళాశాలలో మౌలిక వసతులపై జలవనరుల శాఖ మంత్రి పరిశీలన

368
0

నెల్లూరు : విఆర్ కళాశాలను జలవనరులశాఖా మంత్రివర్యులు డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సందర్శించి మౌళిక వసతులపై ఆరాతీశారు. ఇంతటి కళాశాల నెల్లూరు నగరంలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. విఆర్ కళాశాలను మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు.

విఆర్ కళాశాల చరిత్రలో ఒక మంత్రి కళాశాలకు వచ్చి ఉపాధ్యాయుల, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చేస్తాను అన్న ఒకేఒక మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. విఆర్ కళాశాల అభివృద్ధి బాధ్యతలు నూతన కమిటి ఏర్పడేదాకా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అప్పజెప్పారు. ఇందులో అన్ని రాజకీపార్టీలను, ప్రజా సంఘాలను, మేధావులను సమన్యయం చేసుకుని పనిచేయాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కోరారు.