చీరాల : మద్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎంఇఒ కె లక్ష్మినారాయణ హెచ్చరించారు. కెజిఎం బాలికోన్నత పాఠశాల లో సోమవారం మద్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. 750మంది విద్యార్ధులు ఉండగా కేవలం 70గుడ్లే ఉడికించారేంటని భోజన నిర్వాహకుడిని, పాఠశాల ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయులు వరప్రసాద్‌ను ప్రశ్నించారు. అన్నం తినేవారికే కోడిగుడ్లు ఉడికించినట్లు చెప్పారు. అలా చేయడం సరైన పద్దతి కాదని హెచ్చరించారు. కనీసం గుడ్డయినా అందరు విద్యార్ధులకు అందించాలని సూచించారు. సహాయకుడిని తీసుకుంటే ప్రభుత్వం కేవం రూ.వెయ్యి మాత్రమే ఇస్తుందని, ఎవ్వరూ రావడంలేదని నిర్వాహకులు వివరించారు. పథకాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సూచించారు. స్టాకు రిజిస్టర్ పరిశీలించారు. విద్యార్ధులనుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు.