Home బాపట్ల చిరస్మరణీయులు కొణిజేటి రోశయ్య

చిరస్మరణీయులు కొణిజేటి రోశయ్య

6
0

చీరాల (Chirala) : బహుముఖ ప్రజ్ఞాశాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ డాక్టర్‌ కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah) 4వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలోని ఎంజిసి క్లాత్ మార్కెట్ సెంటర్‌లోని రోశయ్య కాంస్య విగ్రహానికి తెలుగుదేశం నాయకులు, కూటమి నేతలు పూలమాల అర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా తెలుగుదేశం అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్ మాట్లాడుతూ రాజకీయ, ఆర్థిక వ్యవహారాలపై విశేష జ్ఞానం కలిగిన గొప్ప నాయకులు రోశయ్యని అన్నారు. ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. అన్ని పార్టీల గౌరవాన్ని అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశీలని పేర్కొన్నారు. రోశయ్య రాజకీయ జీవితం ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మించాల సాంబశివరావు, వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య, టిడిపి పట్టణ అధ్యక్షులు దోగుపర్తి వెంకట సురేష్, పట్టణ అధ్యక్షురాలు దర్శి నాగేంద్రమణితో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.