Home ప్రకాశం లోక్ అదాలత్ ద్వారా కేసులు సత్వర పరిష్కారం

లోక్ అదాలత్ ద్వారా కేసులు సత్వర పరిష్కారం

358
0

చీరాల : కోర్టు ఆవరణలో శనివారం మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కృష్ణన్ కుట్టి, న్యాయవాదులు, పోలీస్ అధికారులు మాట్లాడారు. ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని కేసులు మెగా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించినట్లు పేర్కొన్నారు. మెగా లోక్ అదాలత్ లో వెలువరించిన తీర్పు అంతిమ తీర్పు అని తెలిపారు. పై న్యాయస్థానాలకు అప్పీలుకి వెళ్లే అవకాశం లేదని న్యాయమూర్తి కృష్ణన్ కుట్టి చెప్పారు.

మెగా లోక్ అదాలత్ ప్రారంభిన రోజు నుండి ఇప్పటివరకు మూడు వందల కేసులు పరిష్కారం ఐనాయని, గతంలో నూట ఎనభై, ప్రస్తుతం నూట ముప్పై కేసులు పరిష్కారం చేశామని తెలిపారు. కార్యక్రమంలో కరోనా వైరస్ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ వ్యాధి నివారణ మందులను న్యాయమూర్తి కృష్ణన్ కుట్టి పంపిణీ చేశారు.