పొన్నూరు : జనవరి 1నుండి వార్డుల్లో ప్రారంభించాల్సిన నూతన సెక్రటేరియట్ల ప్రారంభంపై కార్యదర్శులతో పొన్నూరు మున్సిపల్ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. సిబ్బందికి సూచనలు చేశారు. సెక్రటేరియట్ స్థాయిలోనే ఇక నుండి పాలనాపరమైన పనులన్నీ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. సమావేశంలో వార్డు కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.