చీరాల : పట్టణంలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఏరియా వైద్యశాలలో కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చీరాల ఏరియా వైద్యశాలకు కరోన రోగుల చికిత్స బెడ్లను మంజూరు చేసింది. కరోనా చికిత్స కేంద్రం వద్ద విధి విధానాలను రూపొందించేందుకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డిని కలిసి విది విధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్ 19పాజిటివ్ కేసులు చీరాలలో చికిత్స అందించాలి అంటే సిబ్బంది కొరతని ఎలా అధిగమించాలనే దానిపై అధికారులు ఒక స్పష్టతకు వచ్చారు. సిబ్బంది కొరత లేకుండా రిక్రూట్మెంట్ చేసుకొని వైద్య సేవలు అందించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఏ భవానీప్రసాద్, డాక్టర్ పి శ్రీకాంత్, ఏరియా వైద్యశాల సూపర్నెంట్ డాక్టర్ శేషు కుమార్, చీరాల ఏరియా కొవిడ్-19నోడల్ ఆఫీసర్ డాక్టర్ నారాయణరెడ్డి పాల్గొన్నారు.