చీరాల : ప్రతిరోజు పళ్ళను ఉదయం సాయంత్రం రెండుసార్లు పరిశుభ్రంగా ఉంచుకొనే విధంగా ఉండాలని, అది విద్యార్థి దశ నుండే అలవర్చుకోవాలని ప్రముఖ దంతవైద్యులు డాక్టర్ రవితేజ అన్నారు. రోటరీ క్లబ్ క్షీరపురి ఆధ్వర్యంలో కామాక్షి కేర్ హాస్పటల్ సహకారంతో చీరాల ఏఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో బ్లడ్ గ్రూపింగ్ నిర్వహించి దంతాలను శుభ్రం చేసుకునే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. క్లబ్ అధ్యక్షులు రావి వెంకటరమణ మాట్లాడుతూ రోటరీ జిల్లా 3150 వ్యాప్తంగా 100 క్లబ్బులు ఈరోజు పాఠశాలలో, సమాజంలో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారని, సమాజ సేవలో రోటరీ ఎప్పుడు ముందంజలో ఉంటుందని తెలిపారు.
ప్రధానోపాధ్యాయుడు సాల్మన్ మాట్లాడుతూ కార్యక్రమాన్ని తమ పాఠశాలలో నిర్వహిస్తున్నందుకు రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులకు ధన్యవాదాలు తెలియజేశారు. బ్లడ్ గ్రూప్ నిర్వహించుటకు సహకరించిన కామాక్షి కేర్ హాస్పిటల్ అధినేత దేవరాజు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేంద్ర ప్రసాద్, గాంధీ, ఎలమందేశ్వరరావు, రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి సభ్యులు పాల్గొన్నారు.