Home ప్రకాశం ఉచిత వైద్యశిభిరానికి విశేష స్పందన

ఉచిత వైద్యశిభిరానికి విశేష స్పందన

248
0

చీరాల : శ్రీశ్రీశ్రీ రామానందసరస్వతి ట్రస్ట్‌ వాడరేవు వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిభిరానికి విశేష స్పందన లభించింది. ఆగష్టు 27న ఆదివారం నిర్వహించిన వైద్యశిభిరంలో 284మందికి వైద్యపరీక్షలు చేశారు. గత కొన్నేళ్లుగా వాడరేవు ఆశ్రమం ఆవరణలో ఉచిత షుగరు వైద్యశిభిరం నిర్వహిస్తున్నారు. పరీక్షలు చేయించుకున్న వారందరికీ నెల రోజులకు సరిపడు మందులు ఉచితంగా ఇచ్చినట్లు తెలిపారు. శిభభిరానికి హాజరైన వారికి అల్పారం ఏర్పాటు చేశారు. కరొనా నిబంధనల మేరకు ఎక్కువమంది ఒక చోట చేరకూడదన్న నిబంధనలతో శిభిరం నిర్వహణకు 2020 నుండి ఆటంకం ఏర్పడిందని ఆశ్రమ మేనేజర్‌ నారాయణం సురేష్‌ తెలిపారు. ఇటీవల కరోనా తగ్గడంతో వైద్యశిభిరం నిర్వహణకు ఆటంకం లేకపోవడంతో తిరిగి ప్రారంభించినట్లు తెలిపారు. ఈసందర్భంగా శిభిరానికి హాజరైన వారికి షుగరు వ్యాధిపట్ల డాక్టర్లు అవగాహన కల్పించారు. కేవలం మందులపైనే ఆధారపడకుండా ఆహార అలవాట్లతోపాటు జీవన శైలిలోనూ వ్యాయామం ఉండేలా చూసుకోవాలని సూచించారు. సమయానికి ఆహారం తీసుకోవడంతోపాటు వత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండటం ద్వారా షుగరు నియంత్రణలో ఉంటుందని చెప్పారు. క్యాంపులో డాక్టర్‌ ఎం రాజరాజేశ్వరి, డాక్టర్‌ కమలారాజేశ్వరి, డాక్టర్‌ లలిత్‌ప్రకాష్‌, డాక్టర్‌ పేట శ్రీకాంత్‌, డాక్టర్‌ సుధాకర్‌ యాదవ్‌ వైద్యపరీక్షలు చేశారు. ట్రస్ట్‌ ఉపాధ్యక్షులు కె కృష్ణారావు, ఎ సురేష్‌, ఎంజి శంకరరావు, పి కామేశ్వరరావు, గోపాల్‌, కుమార్‌ రోగులకు ఆహారం, తాగునీటి వసతుల ఏర్పాట్లను పర్యవేక్షించారు.