- శిభిరంలో 927మందికి పరీక్షలు
- ఉచితంగా నెలరోజులకు సరిపడు మందులు పంపిణీ
- అల్పాహారం, తాగునీటి వసతుల ఏర్పాటు
చీరాల (Chirala) : వాడరేవు శ్రీశ్రీశ్రీ రామానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆశ్రమం ఆవరణలో ఆదివారం నిర్వహించిన ఉచిత షుగరు వైద్య శిభిరానికి విశేష స్పందన లభించింది. 927మంది హాజరై ఉచితంగా వైద్య సేవలు పొందారు. వైద్య పరీక్షలు చేయించుకున్న 927మందికి నెల రోజులకు సరిపడు మందులు ఉచితంగా అందజేశారు. శిభభిరానికి హాజరైన వారికి అల్పారం, తాగున్నీరు, ఇతర సహాయక ఏర్పాట్లు చేసినట్లు ఆశ్రమ మేనేజర్ నారాయణం సురేష్ తెలిపారు. మందులు వాడటంతోపాటు ఆహార అలవాట్లు, జీవన విధానం మార్చుకోవాలని వైద్యులు సూచించారు. మానసిక ఆందోళన తగ్గించుకునే విధంగా జీవన విధానం మార్చుకోవడం ద్వారా షుగరు నియంత్రణలో ఉంచుకోవచ్చని చెప్పారు. క్యాంపులో డాక్టర్ ఎం రాజరాజేశ్వరి, డాక్టర్ కమలారాజేశ్వరి, డాక్టర్ లలిత్ ప్రకాష్, డాక్టర్ పేట శ్రీకాంత్, డాక్టర్ సుధాకర్ యాదవ్, డాక్టర్ సూర్యప్రకాష్ వైద్యపరీక్షలు చేశారు. ట్రస్ట్ ఉపాధ్యక్షులు కె కృష్ణారావు, కామేశ్వరరావు, ఎంజి శంకరరావు, కుమార్, ఎ సురేష్, మిత్ర ల్యాబ్ వలి, దుర్గగుడి శీను, గోపాల్, సాయి ఫణికిషోర్, వాడరేవు స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, చీరాల మహిళా కళాశాల విద్యార్థులు రోగులకు ఆహారం, తాగునీటి వసతుల ఏర్పాట్లను పర్యవేక్షించారు.