చీరాల : స్థానిక ఎన్‌ఆర్ అండ్ పిఎం ఉన్నత పాఠశాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పివి ప్రజ్ఞ హాస్పిటల్స్ అధినేత కార్డియాలజిస్ట్ డాక్టర్ పి శ్రీనివాస్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ బి మంజువాణి ఉచిత గుండె, డయాబెటిక్ వైద్య శిబిరం రోటరీ క్లబ్ ఆవరణలో మంగళవారం నిర్వహించారు. శిభిరంలో 88 మందికి బరువు, రక్తపోటు, రాండమ్ బ్లడ్ షుగర్, బిఎంఐ, ఇసిజి పరీక్షలు ఉచితంగా చేశారు. అవసరమైన వారికి మందులు ఉచితంగా అందజేశారు. హార్ట్ స్ట్రోక్ వచ్చినపుడు సిపిఆర్ ఎలా చేయాలో వివరించారు. గుండె జబ్బులు, షుగర్ కంట్రోల్లో వుండటానికి తీసుకోవలసిన ఆహారం, చేయవలసిన వ్యాయామం గురించి వివరించారు. హాజరైన వారందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ పోలుదాసు రామకృష్ణ,సెక్రటరీ చారగుళ్ళ గురుప్రసాద్, గ్రంధి నారాయణమూర్తి, సిహెచ్ బాల వెంకటేశ్వరరావు, నక్కల సురేష్ బాబు, గుద్దంటి రమేష్, చింతా రమేష్, జివై ప్రసాద్, తిరుపతిరావు, సుబ్బారావు, శ్రీనివాసరావు, వీరాంజనేయులు పాల్గొన్నారు.