చీరాల : ఆడవారిలోనే ఎక్కువగా కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని గుంటూరు వేదాంత హాస్పిటల్ డాక్టర్ పి రవిచంద్ పేర్కొన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఎంజిసి మార్కెట్ ఆవరణలో కామాక్షి కేర్ హాస్పిటల్ సహకారంతో గురువారం కిడ్నీ వ్యాధులపై అవగాహన సదస్సు, ఉచిత వైద్యశిభిరం నిర్వహించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి మహిళలు కిడ్నీ సమస్యలపై పరీక్షలు చేయించుకుంటే మంచిదని చెప్పారు. కిడ్నీ రక్త పరీక్షలు, స్కానింగ్ ఉచితంగా చేశారు.
డాక్టర్ రవిచంద్, డాక్టర్ ఎం లక్ష్మిదీపక్ వైద్యపరీక్షలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు కామాక్షి హాస్పిటల్ జనరల్ మేనేజర్ తాడివలస సురేష్ తెలిపారు. కార్యక్రమంలో ఎంజిసి మార్కెట్ కమిటి వైస్‌ప్రెసిడెంట్ గుర్రం రాఘవరావు, జాయింట్ సెక్రటరీ గట్టుపల్లి హేమంత్‌కుమార్, టిటిఎంఎ అధ్యక్షులు చిన్ని లీలాధరరావు, వైస్‌ప్రెసిడెంట్ వల్లంశెట్టి శ్యామ్‌ప్రసాద్ పాల్గొన్నారు.