కొండేపి : ప్రాణంతకమైన కరోనాకి దూరంగా ఉండాలంటే వ్యక్తి గతంగా ప్రతిఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని వైసీపీ మండల నాయకులు, సహకార సంఘ అధ్యక్షులు రావూరి అయ్యారయ్య అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు వైసీపీ నాయకులు తుల్లిబిల్లి అశోక్ బాబు తమ సొంత నిధులతో అందజేసిన 500మాస్క్ లను అయ్యవారయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు.
కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు సూదలగుంట హరిబాబు, ఎఎంసి వైస్ చైర్మన్ చింతపల్లి హరిబాబు, మాజీ సర్పంచ్ పుట్టా వెంకట్రావు, సూదలగుంట వెంకటస్వామి, ల్యాబ్ రమణయ్య, దేవరపల్లి వరుణ్, తుల్లిబిల్లి క్రాంతి, స్టేట్ వెంకటేశ్వర్లు, వీరనారాయణ, పమిడి హరికృష్ణ, నిరంజన్, రవికాంత్, ప్రభుదాస్, బొడ్డు రవీంద్ర, కిషోర్ రాజు, అలెగ్జాండర్, బొల్లా హరి, రాజేష్, నత్తల మురళి, కె రాజు, రాజశేఖర్, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.