– నాయీబ్రాహ్మనులకు కరోనా జాగ్రత్తలపై అవగాహన
– శ్రీ కామాక్షి కేర్ ఆధ్వర్యంలో ఫేసుమస్కులు పంపిణీ
చీరాల : కరోనా రూపంలో ప్రపంచానికి పెను ముప్పు పొంచి ఉందని, అయితే తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనాను నియంత రించవచ్చునని చీరాల రెడ్ క్రాస్ ఛైర్మన్, సీనియర్ వైద్యులు డాక్టర్ హైమ సుబ్బారావు, శ్రీ కామాక్షి కేర్ హాస్పటల్ ఎండీ తాడివలస దేవరాజు పేర్కొన్నారు.
శనివారం హైమా హాస్పిటల్ ప్రాంగణంలో చీరాల- పేరాల నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నాయీబ్రాహ్మనులకు కరోనా వ్యాధి ఎలా వస్తుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ హైమ సుబ్బారావు మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా మానవ జాతికి పెనుసవాలుగా మారిందన్నారు. ఇది మనకు వస్తుందనే భయం కానీ, రాదనే ధీమా కానీ కూడదన్నారు. ఇది అంటువ్యాదే అయినప్పటికీ మనం తెచ్చు కుంటేనే వస్తుందన్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ నిబంధనలు సడలించి సెలూన్ షాపులు తెరిచేందుకు అనుమతించారని చెప్పారు. దుకాణాల వద్దకు అనేక మంది వస్తారని అన్నారు. ఈపరిస్థితిలో ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు. మాస్క్ లను ఉచితంగా అందిస్తున్న శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ తాడివలస దేవరాజు, తాడివలస బ్రదర్స్ ని అభినందించారు.
తాడివలస దేవరాజు మాట్లాడుతూ మాస్కులు ధరించటంతో పాటు, పరికరాలను ఎప్పటికపుడు శుభ్రం చేసుకోవాలని చెప్పారు. దుకాణాలను శానిటేషన్ చేయాలన్నారు. చేతులను ఎప్పటికపుడు సబ్బుతో శుభ్రం చేసుకోవడంతో పాటు శానిటైజర్ రాసుకోవాలని సూచించారు. వీటితో పాటు ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలు పాటించాలన్నారు. ఏమాత్రం అలసత్వం ప్రదర్షించిన భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అనంతరం శ్రీ కామాక్షి కేర్ హాస్పటల్ ఆధ్వర్యంలో డాక్టర్ హైమ సుబ్బారావు చేతుల మీదుగా ముఖానికి పూర్తి రక్షణ నిచ్చే ప్రత్యేకమైన 120 మాస్కులు ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో చీరాల పేరాల నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, వెంకటస్వామి, శ్రీను పాల్గొన్నారు.