– బాగా పనిచేసేవారిని అభినందిస్తాం
– ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు కుర్చీలు
– మండల ప్రత్యేక అధికారులకు ర్యాంకింగ్
– ర్యాంకింగ్‌లో బాపట్ల జిల్లా టాప్‌లో ఉండాలి
– కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, ఐఎఎస్
బాపట్ల (DN5 News) : ఒక నెల తర్వాత మార్టూరు మండలం అన్ని విభాగాలలో టాప్‌లో ఉండాలని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ (Vinod Kumar, IAS)పేర్కొన్నారు. మార్టూరు మండల స్థాయి అధికారులకు నైపుణ్యాలు మెరుగు పరిచే ప్రత్యేక శిక్షణ (వర్కుషాప్) స్థానిక కలెక్టరేట్‌లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ నందు మండల ప్రత్యేక అధికారి, తహశీల్దారు, ఎంపిడిఓ తోకలసి మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పోటీ తత్వంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో పురోగతి సాధించడానికి క్రమశిక్షణ, చురుకుతనంతో పనిచేయాలని అన్నారు. బాగా పనిచేసే అధికారులను అభినందించనున్నట్లు తెలిపారు. మండల పరిధిలో అన్ని విభాగాలలో ప్రజా సానుకూలతలో 100శాతం సాధించాలని, మండల ప్రత్యేక అధికారి, తహశీల్దార్, ఎంపిడిఓ అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. జిల్లా స్థాయి అధికారులు చూరుకుదనంతో పనిచేస్తున్నారాని, కానీ మండల స్థాయి అధికారులలో ఆ చూరుకుదనం కనపడలేదని అన్నారు. మండల స్థాయి అధికారులు కష్టపడి పని చేయాలన్నారు.
నియోజకవర్గం, మండల ప్రత్యేక అధికారి, మండల స్థాయి అధికారులతో వర్క్ షాప్ నిర్వహించాలని, మండల స్థాయి అధికారులు అందరిని వాట్సాఅప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని, మండల ప్రత్యేక అధికారిని ఆదేశించారు.ప్రత్యేక అధికారి,తహశీల్దార్ ఎంపిడిఓ ఇచ్చే చూచనలు మండల స్థాయి అధికారులు తప్పకుండా పాటించాలని అన్నారు. గతంలో ఎప్పుడైనా మండల స్థాయి శాఖల అధికారులు ఒక్క చోట సమావేశం నిర్వహించారా, మండల స్థాయి అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు కూర్చువడానికి కుర్చీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయ సేవాలు, మరియు ఎనర్జీ సేవలలోను గృహ నిర్మాణంలో మార్టూరు మండలం చివరలో ఉండటానికి గల కారణాలను ఏమిటని సంబంధిత అధికారులను ప్రశ్నించారు.
కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ యశ్వంత్, మండల ప్రత్యేక అధికారి, జిల్లా పౌర సరఫరాల శాఖ ఏడి బాషా, మార్టూరు తహసిల్దార్, ఎంపీడీఓ, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, పంచాయతీ సెక్రటిరీలు పాల్గొన్నారు.






