కృష్ణా : నూజివీడు పట్టణ పరిధిలోని బైపాస్ రోడ్డులో గల పంట బోదెలో విసన్నపేట మండలం తాత కుంట్ల గ్రామానికి చెందిన కంచర్ల రంగారావు కుమారుడు వంట మేస్త్రి కంచర్ల శ్రీను (32) పంట బోదెలు శవమై తేలాడు. మృత దేహం దుర్గంధం వెదజల్లేడంతో అక్కడి ప్రజలు అతన్ని గుర్తించినట్లు సమాచారం.
నూజివీడు మండలం జంగంగూడెం గ్రామానికి చెందిన మృతుని సమీప బంధువు నూజివీడులోని బృందావన్ గార్డెన్స్ లో వాచ్మెన్ గా విధులు నిర్వర్తిస్తున్న వెంకటేశ్వరరావుకు మృతుడు సోమవారం కనిపించినట్లు చెబుతున్నారు. శ్రీను మృతదేహంపై నీలి రంగు చొక్కా ప్యాంటు ఉన్నాయి. తల భాగం కనిపించకపోవడంతో, అసలు తల ఉన్నట్ల, లేనట్లా అనేది చర్చనీయాంశం అవుతోంది.
పూర్తిగా బురదలో కూరుకుపోయి నప్పటికీ ఉండి ఉంటే కచ్చితంగా కనిపిస్తోందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పోలీసులు మృతదేహం పరిశీలిస్తున్నారు.