మైలవరం : శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు వైసీపీ కార్యకర్తల పాదయాత్ర ప్రారంభించారు. జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావడం నందిగామ నుండి మెండితోక జగన్మోహనరావు, మైలవరం నుండి వసంత కృష్ణ ప్రసాదు ఎమ్మెల్యేలుగా విజయం సాధించడంతో చందర్లపాడు మండలం ముప్పాళ్ళ, వెలదికోత్తపాలెం గ్రామాలకు చెందిన యువకులు పాదయాత్రగా తిరుపతి బయలుదేరారు. మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు చందర్లపాడు మండలం ముప్పాళ్ళ వచ్చి వారిని కలిసి జెండా ఉపి పాదయాత్రలో కొద్ది సేపు నడిచి వారిని అభినందించారు.