కరోనా మహమ్మారి కారణంగా ఇంటికే పరిమితమైన సినీ స్టార్లు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. లాక్డౌన్లో కారోనాపై అవగాహన కల్పిస్తూ కాలక్షేపం చేశారు. కొందరైతే ఆట, పాటలతో సోషల్ మీడియాలో సందడి చేశారు. మరికొందరైతే గ్రీన్ ఛాలెంజ్‌లంటూ గడిపేశారు. ప్రస్తుతం పరిస్థితులు కొంత మెరుగుపడటంతో మళ్లీ రంగులు వేసుకునేందుకు సిద్ధమయ్యారు. 7 నెలలపాటు షూటింగ్‌లకు దూరంగా ఉన్న వీరు ఇప్పుడు మరోసారి బిజీ అవుతున్నారు. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా సినిమాల చిత్రీకరణకు కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాల నుంచి అనుమతి రావడంతో సినీ పరిశ్రమ నూతనోత్సాహాన్ని చూపేందుకు రెడీ అయింది.
ఇక సినిమా షూటింగ్‌లు షురూ కావడంతో హీరో మహేశ్ బాబు దూకుడు పెంచారు. తన తదుపరి చిత్రం చిత్రీకరణను పరుగులు పెట్టించేందుకు రెడీ అయ్యారు. వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ప్రేక్షకుల ముందుకు రావాలని ఆతృతగా ఉన్నారు. ఈ మేరకు ఆయన త్వరలో అమెరికా వెళ్లనున్నారు. 45 రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. తాను నటించనున్న‘సర్కారు వారి పాట’చిత్రాన్ని త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇక మహేశ్‌బాబుతో పాటు చిత్ర యూనిట్ కూడా నవంబర్‌లో అమెరికా వెళ్లనుంది. మొత్తం 45 రోజుల పాటు ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాలు, కుట్రలపై ఆధ్యాంతం రక్తికట్టించేలా ఈ చిత్ర కథాంశాన్ని రూపొందించారట. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. మహేశ్ సరసన కీర్తి సురేశ్ నటించనున్నట్లు ఇప్పటికే టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ల్ లుక్ అదరగొట్టేసింది. ఈ లుక్‌లో మహేశ్ ఫేస్ చూపించకపోయినా గెటప్ మాత్రం అభిమానుల్ని కట్టిపడేసింది. దీంతో ఈ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. అయితే ఈ చిత్రయూనిట్ అమెరికా ట్రిప్పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలో స్పందిస్తారేమో చూడాలి. మరోవైపు మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మరి పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో వేచి చూడాలి.