Home సినిమా ఢీ కొడతారా… రాజీ పడతారా!

ఢీ కొడతారా… రాజీ పడతారా!

251
0

సినిమా అంటే మాయా ప్రపంచమే కాదు. వందల కోట్లు చేతులు మారే వ్యాపారం కూడా. ఇక్కడ ఏ చిన్న విషయం తేడా కొట్టినా నిర్మాతల పని గల్లంతే.
మారిన కాలమాన పరిస్థితుల్లో తొలి వారం వసూళ్ళే సినిమాలకు ఆయువు పట్టుగా మారింది. అందుకే సాధ్యమైనంత వరకూ సినిమాల విడుదల సోలోగా
ఉండేలా ప్లాన్ చేస్తుంటారు. అడపా దడపా క్లాష్ వచ్చినా యాక్టీవ్ నిర్మాతలు అందరూ ఏర్పాటు చేసుకున్న గిల్డ్ పోటీని చాలా వరకూ నియంత్రిస్తూ
వస్తోంది. ఇటీవల ‘గ్యాంగ్ లీడర్’, ‘గద్దలకొండ గణేష్’ సినిమాల మధ్య ఇలాంటి పోటీ ఏర్పడినపుడు కూడా గిల్డ్ ఆ యా చిత్రాల నిర్మాతల మధ్య
సయోధ్య కుదిర్చింది. చిన్న సినిమాల క్లాష్ ని పరిష్కరించామని జబ్బలు చరిచిన గిల్డ్ సంక్రాంతికి ఒకే రోజు వస్తున్నామని ప్రకటించిన మహేశ్, బన్నీ
సినిమాల విషయంలో మౌనం వహించటం ఆశ్చర్యం కగిలిస్తోంది.

నిర్మాతలకు నష్టం కలిగే పనులు చేయమంటూ అప్పట్లో గిల్డ్ యాక్టీవ్ మెంబర్ దిల్ రాజు స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజానికి ‘అల వైకుంఠపురంలో, ‘సరిలేరు
నీకెవ్వరు’ సినిమాల నిర్మాతలు కూడా గిల్డ్ సభ్యులే. ముఖ్యంగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి దిల్ రాజు కూడా ఓ నిర్మాత. ‘గ్యాంగ్ లీడర్’, ‘గద్దలకొండ
గణేష్’ విషయంలో నిర్మాతలను కాంప్రమైజ్ చేసి ఓ వేదికపైకి తీసుకురాగలిగిన దిల్ రాజు… ఇప్పుడు తన సహనిర్మత అనీల్ సుంకర, చినబాబుని
కూర్చోబెట్టి ఎందుకు కాంప్రమైజ్ చేయలేకపోతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇగోలకు పోయి థియేటర్లు షేర్ చేసుకుని వసూళ్ళని తగ్గించుకుంటే
నిర్మాతలకే కాదు… సినిమా కొన్న పంపిణీదారులు, అడ్వాన్స్ ఇచ్చిన ప్రదర్శనదారులు కూడా బాగా నష్టపోయే ప్రమాదం ఉంది. పరిస్థితి గ్రహించి
ఎవరైనా ముందు వెనుకకు జరిగితే అటు చిత్రపరిశ్రమకి ఇటు సినిమాలలో ఇన్ వాల్స్ అయిన వారికి కూడా మేలు జరుగుతుంది.