చీరాల : కొత్తపేటలోని సనాతన జీవన్ ట్రస్ట్ నందు చీరాల మున్సిపల్ సిబ్బంది, కార్మికులకు భారత ప్రభుత్వ ఆయుష్ డిపార్ట్మెంట్ సిఫార్సు చేసిన మహాసుదర్శనకాడ అనే ఔషధాలను 520బాటిల్స్ ను ఉచితంగా అందజేశారు. మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, టిపిఓ కాల్వ శ్రీనివాసులుకు సనాతన జీవన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ నాడీ వైద్య నిపుణులు డాక్టర్ శశిధర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కిరణ్, చందు, శివరామకృష్ణ , సుధాకర్, కబీర్ తదితరులు పాల్గొన్నారు.