Home ప్రకాశం రక్తదానంపై ప్రజలలో చైతన్యం నింపడానికి మాగుంట ట్రస్ట్ ద్వారా నిరంతరం రక్తదాన శిబిరాలు : మాగుంట...

రక్తదానంపై ప్రజలలో చైతన్యం నింపడానికి మాగుంట ట్రస్ట్ ద్వారా నిరంతరం రక్తదాన శిబిరాలు : మాగుంట చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాగుంట రాఘవరెడ్డి

395
0

ఒంగోలు : ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రిమ్స్, ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఒంగోలులోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ప్రారంభించారు. రక్తదానం చేసిన ట్రస్ట్ చైర్మన్ మాగుంట రాఘవరెడ్డి, ఇతర రక్తదాతలకు సర్టిఫికేట్ లు అందజేశారు. ఈ సందర్భంగా మాగుంట ట్రస్ట్ చైర్మన్ మాగుంట రాఘవరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రక్తదానం చేసేవారు తగ్గుతుండడంతో రక్తదానం చేయడానికి ఎక్కువ మంది ప్రజలను చైతన్య పరచడంలో భాగంగా గత సంవత్సరం అక్టోబర్ లో ట్రస్ట్ ద్వారా రిమ్స్ సహకారంతో రక్తదానం ప్రారంభించినట్లు తెలిపారు.

కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించడంతో ప్రజలందరూ ఇండ్లకే పరిమితమైనందున జిల్లాలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్ పాజిటివ్ రోగులు, ఇతర అనారోగ్యంతో వైద్యశాలల్లో చేరిన రోగులకు రక్త నిల్వలు సరిపోయినంత లేనందున ఎంతో మంది రోగుల ఇబ్బందులు పడుతున్నారు. వైద్యశాలల్లో రోగుల భవిష్యత్ అత్యవసరాలను దృష్టిలో పెట్టుకుని, జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సైతం నిరంతర కార్యక్రమంగా విస్తృతంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రక్తదానంపై ప్రజలలో చైతన్యం కల్పిస్తూ, ప్రజల నుండి రక్త నిల్వలు సేకరించి, ప్రభుత్వ వైదశాఖకు అందజేస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటి వరకు జిల్లాలో 14 రక్తదాన శిబిరాల ద్వారా 553మంది రక్తదాతలు రక్తదానం చేశారన్నారు. ఈ కరోనా సమయంలో రక్తదానం ఒక సామాజిక బాధ్యతగా గుర్తించి తగు జాగ్రత్తలతో భౌతిక దూరం పాటిస్తూ స్వచ్చందంగా ముందుకొచ్చి యువత రక్తం ఇవ్వడం ద్వారా వేరొకరికి పునర్జన్మ ఇవ్వడమేనని రక్తదాతలను అభినందించారు. మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానశిబిరాలలో పాల్గొంటున్న ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రక్తదాతలకు మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జ్యూస్ ప్యాకెట్లు, శానిటయిజర్లు, మాస్కులు, సర్టిఫికెట్ లు రాఘవరెడ్డి చేతుల మీదుగా అందజేశారు.