Home ప్రకాశం మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవరెడ్డిలకు ఘనస్వాగతం

మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవరెడ్డిలకు ఘనస్వాగతం

222
0

– వల్లూరమ్మగుడిలో పూజలు నిర్వహించిన మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవరెడ్డి

– ఘనంగా స్వాగతం పలికిన అశోక్ బాబు, వైసీపీ నాయకులు, మాగుంట అభిమానులు

టంగుటూరు (దమ్ము) : ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆయన తనయులు మాగుంట రాఘవరెడ్డి చాలా రోజులు తర్వాత నెల్లూరు నుండి ఒంగోలు వస్తున్న సందర్భంగా కొండపి నియోజకవర్గ ఇంచార్జ్ వరికూటి అశోక్ బాబు, నియోజకవర్గంలోని ముఖ్యనాయకులతో కలిసి టంగుటూరు టోల్ ప్లాజా వద్ద వారిఇరువురికి శాలువాకప్పి, పూలమాలతో ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం వారితో కలిసి వల్లూరమ్మ దేవాలయానికి వెళ్లారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న వైసీపీ శ్రేణులు, మాగుంట అభిమానులు బాణసంచా కాలుస్తూ మేళతాళాలతో పూల జల్లులతో గజమాలతో వారిరువురిని సత్కరించి ఘనంగా స్వాతం పలికారు.అనంతరం వల్లూరమ్మ దేవాలయంలో దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో వేదమంత్రాలతో అర్చకులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు, మాగుంట అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.