Home ఆంధ్రప్రదేశ్ దాడులు అరికట్టకుంటే ఉపేక్షించేది లేదు : లోకేష్

దాడులు అరికట్టకుంటే ఉపేక్షించేది లేదు : లోకేష్

445
0

గుంటూరు : సీఎం చెప్పేది ఒకటి. చేసేది ఒకటి. ఏపీలో బీహార్ తరహా పాలన నడుస్తోంది. టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు. టీడీపీకి మెజార్టీ వచ్చిన గ్రామాల్లో గోడలు కడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. అంటూ టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆరుగురు టీడీపీ కార్యకర్తలను హత్య చేసారని అన్నారు. 130 మంది కార్యకర్తలపై దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేసారని చెప్పారు.

తాము సంయమనంతో ఉన్నామన్నారు. అయినా కావాలని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. హత్యలపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడలేదని చెప్పారు. కార్యకర్తలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాజకీయ హత్యలు జరుగుతుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయన్నారు. 2004లో వైయస్ ముఖ్యమంత్రి అయిన సందర్భంలో కూడా ఇలానే టిడిపి కార్యకర్తలను హత్య చేసారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకొమన్నారు.