అమరావతి : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరువారాలపాటు వాయిదావేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలు యధావిధిగా కొనసాగుతాయని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియ యధాతధంగా ఉంటుందన్నారు. ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక చర్యలపై ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఘర్షణలకు భాద్యులైన అధికారులపై చర్యలకు ఆదేశించారు. గుంటూరు జిల్లా మాచర్ల సిఐపై సస్పెన్షన్ వేటు వేశారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పిలను తప్పిస్తూ ఆదేశాలు ఇచ్చారు. తిరుపత, మాచర్ల, పుంగనూరులో జరిగిన పరిణామాలపై నిచితంగా పరిశీలించి అవసమైతే కొత్త షెడ్యూల్ జారీ చేస్తామని హెచ్చరించారు. అధికారుల వ్యవహర శైలిపై అభ్యంతరం వ్యక్తం చేశారు.