చీరాల : మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చీరాల కోర్టు హాలులో ఉచిత న్యాయ సహాయ కేంద్రాన్ని న్యాయమూర్తి ఎస్ కృష్ణన్ కుట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు, అనాధ బాలలతో పాటు లక్షలోపు ఆదాయం ఉన్న వారు ఉచిత న్యాయ సహాయానికి అర్హులని చెప్పారు. 15100 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చన్నారు.