టంగుటూరు (దమ్ము) : మండలంలోని వల్లూరులో ప్రతి ఇంటికీ రోజూ మంచినీరు సరఫరా చేసేందుకు ఓవర్ హెడ్ స్టోరేజీ ట్యాంకు నిర్మాణానికి ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్, కొండపి నియోజక వర్గ వై.సీ.పీ ఇంఛార్జి వరికూటి అశోక్ బాబు గురువారం శంకుస్థాపన చేశారు. జల జీవన్ మిషన్ పథకంలో భాగంగా 25లక్షల అంచనాతో 40వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకు నిర్మాణాన్ని 5నెలల్లో పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షించనున్నారు.
ఈ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన అతిధులకు గ్రామస్తులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అర్చకుల ఆశీర్వచనాల మధ్య జరిగిన కార్యక్రమంలో ఆర్.డ్ల్యూ.ఎస్ ఎస్.ఈ మర్ధన్ అలీ, ఇరిగేషన్ ఎస్.ఈ లక్ష్మా రెడ్డి, ఎం.పీ.డీ.వో అజిత, తహసీల్దారు చిరంజీవి, గ్రామ సర్పంచ్ పద్మ, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.