టంగుటూరు : మండలంలోని వల్లూరులో సచివాలయ భవనానికి, రైతు భరోసా కేంద్ర భవన నిర్మణాలకు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. మండలంలో నిర్మిస్తున్న నూతన భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెడుతున్న ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలందరికీ అందేలా అధికారులు చొరవతీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను కోరారు.
ఈ కార్యక్రమానికి పిడిసిసి బ్యాంక్ చైర్మన్, వైఎస్ఆర్ సీపీ కొండేపి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మాదాసి వెంకయ్య, మండల అభివృద్ధి అధికారి హరికృష్ణ, టంగుటూరు సహకార సంఘ అధ్యక్షులు రావూరి అయ్యవారయ్య, పంచాయతీ రాజ్ డిఈ తిరుపతిరావు, ఏఈ రవిబాబు, ఈఓ స్వర్ణలత,
వల్లూరు గ్రామ మాజీ సర్పంచులు చుండి సోమిరెడ్డి,
సుబ్బమ్మ, వైసీపీ నాయకులు హనుమారెడ్డి, శేఖర్ రెడ్డి, వల్లూరు కోటి, వైసిపి నాయకులు పాల్గొన్నారు.






