Home బాపట్ల వృత్తి కోల్పోయిన చేనేతలకు భూమి ఇవ్వాలి

వృత్తి కోల్పోయిన చేనేతలకు భూమి ఇవ్వాలి

15
0
Oplus_16908288

చీరాల (Chirala) : వృత్తి కోల్పోయిన చేనేతలకు రాష్ట్ర ప్రభుత్వం భూమి ప‌రిహారం ఇవ్వటంతో పాటు కుటుంబానికి నెల‌కు ఇచ్చే రూ.5వేలు పింఛను సరిపోదని, దానిని వెంటనే పెంచాలని ఎఐబీఎస్‌సి జాతీయ సమన్వయకర్త, ఉమ్మడి ఎపి మాజీ డీజీపీ డాక్టర్ జె పూర్ణచంద్రరావు కోరారు. పేరాల‌ పద్మశాలీయ కళ్యాణ మండపంలో ప్రజాబంధు ప్రగడ కోటయ్య ప్రాంగణంలో నిర్వహించిన రాష్ట్ర చేనేత (Chenetha) సదస్సులో ఆయన మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు తమ వృత్తుల ద్వారా లాభాలు తెస్తున్నాయని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందినంత మాత్రాన సిరిసిల్ల చేనేతల పరిస్థితి మారలేదని అన్నారు. అదేవిధంగా అమరావతి ఎదిగితే చీరాల, మంగళగిరి చేనేతలకు లాభం ఏమీ రాదని అన్నారు.

అమరావతిలో (Amaravathi) ఎకరం భూమి ఇచ్చిన వారికి 1250 గజాలు దాదాపు రూ.12.5 కోట్ల విలువైన లాభం లభిస్తుంటే మంగళగిరి ప్రాంతాల్లో చేనేతలకు మాత్రం ఏ ప్రయోజనం లేకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. పోలవరం (Polavaram) ముంపుతో 7మండలాల్లోని ఆదివాసీలు కోల్పోతున్న భూములపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రైతులకు భూమికి భూమి ఇస్తున్న ప్రభుత్వం ఆదివాసీలు, చేనేతలు వృత్తులు కోల్పోతే పట్టించుకోవడం లేదని అన్నారు. చేనేతల పునరావాసం కోసం 200 ఎకరాల ప్రత్యేక ఎకానమిక్ జోన్ (సెజ్) ఏర్పాటు చేసి, మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి 100 నుంచి 150 గజాల భూమి కేటాయించాలని చేశారు. మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్సీలు కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది వై కోటేశ్వరరావు (వైకె), ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు దామర్ల శ్రీకృష్ణ, కన్వీనర్ జంజనం శ్రీనివాసరావు, కార్యదర్శి చండూరు వాసు, డాక్టర్ హైమా సుబ్బారావు, వేమేశ్వరి, శీలం వెంకటేశ్వరమ్మ పాల్గొన్నారు.