చీరాల : కార్మికుల హక్కులు కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్బంగా సిఐటియు అధ్యక్ష్య, కార్యదర్శులు ఎన్ బాబురావు, ఎం వసంతరావు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనలో భాగంగా మునిసిపల్ కార్మికులతో ఆర్టీసి బస్టాండ్ వద్ద నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల కష్టాన్ని కార్పొరేట్ కంపెనీలకు దారాధత్తం చేసే విధంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు గోసాల సుధాకర్, పలువురు నాయకులు పాల్గొన్నారు.