Home ప్రకాశం దళితులపై దాడులకు నిరసనగా కెవిపిఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

దళితులపై దాడులకు నిరసనగా కెవిపిఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

291
0

చీరాల : కెవిపిఎస్, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చీరాల ఎన్జీవో భవన్లో దళితులపై దాడులకు నిరసనగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి కెవిపిఎస్ నాయకులు లింగం జయరాజు అధ్యక్షత వహించారు. మాస్కు లేదనే కారణంతో దళిత యువకుడైన యెరిచర్ల కిరన్ కుమార్ పై ఎస్ఐ విజయ్ కుమార్ కొట్టి హత్య చేయడంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ వివిధ దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఎస్సైతోపాటు సిఐ, డిఎస్పీలను కూడా బాధ్యులను చేస్తూ హత్యానేరం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిధిలో కేసు నమోదు చేసి విచారణ చేయాలని ప్రజా సంఘాల నాయకులు తీర్మానించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి దళితులపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు పెరిగాయని పేర్కొన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్రస్థాయిలో దళితులపై దాడుల ఘటనలను విచారించేందుకు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని తక్షణం ఏర్పాటు చేసి జిల్లాలో జరిగిన ఘటనలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బలహీనవర్గాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు గోసాల ఆశీర్వాదం, ఎరుకల హక్కుల పోరాట సమితి నాయకులు మోహన్ కుమార్ ధర్మ, సిపిఎం కార్యదర్శి నలతోటి బాబురావు, సిపిఐ కార్యదర్శి మేడ వెంకటరావు, కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరు వాసు, ఐఎల్టిడి ఫెడరేషన్ కార్యదర్శి గోసాల సుధాకర్, జనసేన జిల్లా నాయకులు గూడూరు శివరాం ప్రసాద్, బీఎస్పీ నాయకులు వై సురేష్ కుమార్, గుమ్మడి ఏసురత్నం, దళిత సంఘం నాయకులు దేవతోటి సుందర్రావు, ఎస్జె చిరంజీవి, పి ఆనంద్, ప్రసాద్, జెవివి రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్ర రామారావు పాల్గొన్నారు.