కనిగిరి : ఎస్‌సి, ఎస్‌టి కమీషన్ తొలి ఛైర్మన్, హైకోర్టు రిటైర్డు జస్టిస్ పున్నయ్య సంతాప సభను సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. పున్నయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా సిపిఎం ప్రాంతీయ కమిటి కార్యదర్శి పిసి కేశవరావు మాట్లాడుతూ సామాజిక న్యాయం సాధనకోసం పున్నయ్య చేసిన సేవలను గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కెవిపిఎస్ చేసిన ఉధ్యమ ఫలితంగా కమీషన్ ఆవిర్భవించిందన్నారు. పున్నయ్య రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి కళ్లకు కట్టినట్లు నివేదిక ఇచ్చారని చెప్పారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పిల్లి తిప్పారెడ్డి, వి కాశయ్య, జి శ్రీను, షేక్ బషీర్, ఎ నారాయణ, ఎం కొండారెడ్డి, షేక్ మైమూన్, శాంతకుమారి, ఏడుకొండలు పాల్గొన్నారు.