Home ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వాలు సామాజిక స్పృహ‌తో ప‌నిచేయాలి : కెవిపిఎస్ రాష్ట్ర నాయ‌కులు ద‌డాల సుబ్బారావు

ప్ర‌భుత్వాలు సామాజిక స్పృహ‌తో ప‌నిచేయాలి : కెవిపిఎస్ రాష్ట్ర నాయ‌కులు ద‌డాల సుబ్బారావు

689
0

చీరాల : ప్ర‌భుత్వాలు సామాజిక కోణంలో ఆలోచించాల‌ని, ద‌ళితులు, వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల అభివృద్దికి ఉద్దేశించిన చ‌ట్టాల‌ను స‌క్ర‌మంగా అమ‌లు చేయాల‌ని కెవిపిఎస్ రాష్ట్ర నాయ‌కులు ద‌డాల సుబ్బారావు పేర్కొన్నారు. ప్ర‌భుత్వాలు కేటాయిస్తున్న నిధులు కూడా ద‌ళిత పేట‌ల అభివృద్దికి ఖ‌ర్చు చేయ‌కుండా మురిగిపోయే ప‌రిస్థితి క‌ల్పిస్తున్నార‌ని అన్నారు. ద‌ళితుల ర‌క్ష‌ణ‌కు ఉన్న చ‌ట్టాల‌ను అమ‌లు చేయ‌డంలేద‌న్నారు.

దళితులకు కనీసం ఎక్కడ కూడా స్మశాన వాటికలు కూడా లేవన్నారు. ఉన్న‌చోట్ల 270పైగా ఆక్రమణల‌కు గురయ్యాయన్నారు. ప్రకాశం జిల్లాలో 1685అట్రాసిటీ కేసులు నమోదైతే కేవలం 5కేసులు మాత్రమే పరిష్కారం అయ్యాయి అంటే ఏ విధంగా ప్రభుత్వాలు దళితులపట్ల శ్రద్ద వహిస్తున్నాయో అర్ధమవుతుంన్నారు. ప్రభుత్వం నీరు చెట్టు పేరుతో ద‌ళితుల‌ భూములను లాక్కున్నార‌ని అన్నారు. దేవరపల్లి, గరగపర్రు, గొట్టిపాడు వంటి గ్రామాలలో నీరు చెట్టు ప‌థ‌కం పేరుతో భూములు లాక్కోవ‌డంపై పోరాడి విజయం సాధించారని చెప్పారు. మహాసభల ప్రారంభానికి ముందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల‌ర్పించారు. అనంతరం ఇటీవల కాలంలో మరణించిన మాజీ ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్ జస్టిన్ పున్నయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం ప‌ఠించారు.

అంబేద్కర్ భవనంలో ఆదివారం ప్రారంభమైన కెవిపిఎస్ జిల్లా 4వ మ‌హాస‌భ‌ల ప్రారంభ స‌భ‌కు చీరాల ప్రాంతీయ క‌మిటి అధ్య‌క్షులు లింగం జ‌య‌రాజు అధ్య‌క్ష‌త వ‌హించారు. స‌భాప్రాంగ‌ణానికి మాజీ శాస‌న స‌భ్యులు తవనం చెంచెయ్య పేరుతో నిర్వ‌హించారు. రాజ్యాంగం – ప్రజాస్వామ్యం -ప్రభుత్వ పరిష్కారాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి బొమ్మతోటి రఘురాం, అధ్యక్షులు అట్లూరి రాఘవులు, నాయకులు జూపూడి రోశయ్య, బాబూరావు, వసంతరావు పాల్గొన్నారు.