చీరాల : కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కెవిపిఎస్) ప్రకాశం జిల్లా 4వ మహాసభలు అంబేద్కర్ భవన్లో 2వ రోజుకి చేరుకున్నాయి. తొలుత కెవిపిఎస్ సీనియర్ నేత జలా అంజయ్య పతాకావిష్కరణ చేశారు. అనంతరం ప్రతినిధుల సభ నిర్వహించారు. ఇందులో దళితులపై వివక్ష – కెవిపిఎస్ చేస్తున్న పోరాటాలను కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి వివరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య వైద్యం అందుబాటులో లేకుండా చేసే చర్యలకు పునుకుండున్నారు. పిహెచ్సి, రిమ్స్ లలో సరైన సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.
జిఓ నంబర్ 70తెచ్చి నీరు చెట్టు పేరుతో సుమారు 50 సంవత్సరాల నుండి దళితులు సాగుచేసుకుంటున్న భూములను పోలీసులు, అధికారులు సహకారంతో చేరువులుగా, కుంటలుగా మార్చుతున్నారని విమర్శించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో అసమానతలు ఉన్నాయని విమర్శించారు. ఎస్సి, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా పొందే రుణాలను జన్మభూమి కమిటీ సభ్యులు ప్రభావితం చేస్తున్నరని పేర్కొన్నారు. జన్మభూమి సభ్యుల అనుయాయులకు మాత్రమే రుణాలు అందేలా చూస్తున్నారని విమర్శించారు.
జిల్లా ఉపాధ్యక్షులు జాలా అంజయ్య మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో 23.19శాతం దళితులు ఉన్నారని అన్నారు. అక్షరాస్యత జిల్లాలో 63.8శాతం ఉన్న ఎస్సిలలో 59.7శాతం మాత్రమే ఉందన్నారు. దళితులు, గిరిజనులలో 28.96శాతం మాత్రమే ఉందని వివారించారు. జిల్లాలో అక్షరాస్యత పెరుగుతున్న దళితులలో నానాటికి తగ్గుతుందిని అన్నారు. అనంతరం జిల్లా కార్యదర్శి బొమ్మతోటి రఘురాం నివేదిక ప్రవేశపెట్టారు. నియోజకవర్గాల వారీగా సమస్యలపై చర్చించారు. మహాసభలో సమస్యలు పరిష్కరించాలని తీర్మానాలను ఆమోదించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు అట్లూరి రాఘవులు, నాయకులు లింగం జయరాజ్, రామారావు, అత్తింటి శ్రీను, జూపూడి రోశయ్య, అంజిబాబు, గోసాల సుధాకర్, సత్యమూర్తి పాల్గొన్నారు.