Home ప్రకాశం అంబేద్కర్ నివాసం పై దాడి చేయడం దుర్మార్గమైన చర్య : కెవిపిఎస్

అంబేద్కర్ నివాసం పై దాడి చేయడం దుర్మార్గమైన చర్య : కెవిపిఎస్

306
0

చీరాల : మహారాష్ట్రలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నివాసంలోనే పూల కుండీలను ఇతర వస్తువులను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని కెవిపిఎస్ చీరాల డివిజన్ అధ్యక్షులు లింగం జయరాజు పేర్కొన్నారు. ఇలాంటి దాడి ఘటనను ప్రజలందరూ ఖండించాలని కోరారు. సుందరయ్య భవన్లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దాడికి పాల్పడిన దుండగులను తీవ్రంగా శిక్షించాలని కోరారు. సమావేశంలో జి కృపారావు, బి అబ్రహం, సిఐటియు నాయకులు ఎన్ బాబురావు పాల్గొన్నారు.